అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీటీసీని ఎంపీగా గెలిపించబోతున్నామని అన్నారు. ‘ప్రజాగళం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మార్చే కీలక తరుణమిదన్నారు.. ఏపీ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు ఇవని తెలిపారు. వైసీపీని చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీదేనని… ఎంపీటీసీని ఎంపీగా నిలబెట్టి గెలిపించబోతున్నామన్నారు. జగన్ పేరు మార్చి.. జే..గన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
జగన్ పేరు మార్చి.. “జే..గన్” రెడ్డిగా నామకరణం
83