తిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ ఏర్పాటుపై తాజాగా జీవో విడుదల చేసింది. ఈ సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పని చేయనున్నారు. సభ్యులుగా గోపీనాథ్ జట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావు, సీతరామరాజు, శినారాయణ స్వామి, సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణగా వ్యవహరించనున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ గత ప్రభుత్వ హయాంలో అపవిత్రం అయిందని, కల్తీ నెయ్యి వినియోగించారని నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పవిత్రంగా ఉండాల్సిన లడ్డూను కల్తీ చేయడంపై శ్రీవారి భక్తులు, హిందువులు, రాజకీయ నాయకుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. లడ్డూను అపవిత్రం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీంతో లడ్డూ వివాదంపై లోతైన విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌లో సభ్యులుగా సిన్సియర్ అధికారులను నియమించింది. దీంతో లడ్డూ వివాదంపై సిట్ అధికారులు వేగంగా విచారణ చేపట్టనున్నారు. గతంలో టీటీడీలో పని చేసిన పలువురిని విచారించనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తుపై ఉత్కంఠ నెలకొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సికింద్రాబాద్, వాస్కోడిగామా మధ్య కొత్త రైలుతెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే పర్యాటకుల కోసం తీసుకొచ్చిన సికింద్రాబాద్-వాస్కోడిగామా రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి..ప్రతి గురు,శనివారం వాస్కోడిగామా నుంచి బయలుదేరుతుంది. ఈ…
- తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా చర్యలుప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహంచారు. ఈ…
- మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీమూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు…
- ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోంది. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు. ఆన్లైన్ ద్వారా లోడింగ్,…
- అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయంత్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోఅయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి