ఎస్.కోట స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యూయలర్స్ తన మొదటి బ్రాంచ్ ను ఎస్ కోటలో సీని నటి అనసూయ భరద్వాజ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణాభరణాల విక్రయంలో ఆదిలక్ష్మి జ్యూయలర్స్ కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందిందన్నారు. ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాట్లాడుతూ బంగారు ఆభరణాలు అంటే మహిళలకు అమితమైన ఇష్టమన్నారు. అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు. అయితే, బంగారు ధరలు ఈమధ్యన భారీగా పెరిగాయన్నారు. బంగారం విలువ ఎప్పటికీ తగ్గదన్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద జ్యూయలరీ షోరూమ్ ఓపెన్ చేయడం ఆనందదాయకం అన్నారు. ఈ చుట్టు పక్కల ప్రాంతీయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
Vijayanagaram
Jindal Land Dwellers :
ఎస్.కోట మండలం బొడ్డవరలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కలిసిన జిందాల్ భూ నిర్వాసితులు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భముగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జిందాల్ అల్యూమినా కర్మాగారం వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో మా ప్రాంత పెద్దలు, సర్పంచులు, ఎం.పి.టి.సిలు, జిల్లా అధికారులు, జిందాల్ ప్రతినిధులు అందరూ సమాలోచన చేసి మా భూముల్ని జిందాల్ కు అప్పగించడానికి అంగీకరించాము. కంపెనీ ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి, నగదు మరియు షేర్లు మాకు ఇస్తామని మమ్మల్ని నమ్మించి, ఈరోజు అమాయకులైన గిరిజనులు, హరిజనులు మరియు ప్రజలను మోసంచేసే స్థితికి యాజమాన్యం వారు వచ్చారు.
మాలో మాకు విభేదాలు, అనుమానాలు కలిగే విధముగా, ఇదివరకే జారీ చేసిన షేర్ల మొత్తము అందించే విషయమునకు సంబంధించి ఆ గ్రామం వాళ్ళు సంతకాలు చేసారు అనీ ఈ గ్రామం వాళ్ళు సంతకాలు చేసారు. షేర్లకు బదులు నగదు మొత్తము ఇచ్చేయమని అన్నారు. మీరు కూడా సంతకాలు చేసేయండి, లేదంటే భవిష్యత్తులో నగదు అందదని కొంతమంది మధ్యవర్తుల ద్వారా భయపెట్టి కొంతమందితో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరి ఇదే విషయమై గతంలో ఎమ్మెల్సీ సమావేశమైనపుడు, జిందాల్ కంపెనీ నిర్మాణమునకు భూములు ఇచ్చిన నిర్వాసిత రైతులకు నగదుతో పాటు కొంతమొత్తం అనగా ఒక్కో ఎకరా జిరాయితీ భూమికి రూ.2,00,000/-లు, డి.పట్టా భూమికి రూ.2,00,500/- చొప్పున షేర్ల రూపేణా యాజమాన్యం వారు పరిహారం క్రింద ఇచ్చారని, షేర్లు ఇచ్చినపుడు ఉన్న విలున (ఒక్క షేరు విలువ రూ.10/-లు) ఈ 15 సంవత్సరములలో వడ్డీతో పాటు మొత్తం విలువ పెరిగిందని, సేకరించిన ప్రతి ఎకరం భూమికి పెరిగిన మొత్తము ప్రకారం కంపెనీలో భాగస్వాములుగా గుర్తించి న్యాయం చేయాలని కోరామని తెలిపారు. కానీ ఇంతవరకు ఈ విషయం తేలకపోగా ఇప్పుడు షేర్లు జారీ చేసినపుడు ఉన్న విలువ ప్రకారం బలవంతముగా సంతకాలు చేయించుకుని యాజమాన్యం నగదు ఇవ్వజూపడం అన్యాయం అని అన్నారు.
కంపెనీ ఏర్పాటు కోసం సేకరించిన భూములలో జిందాల్ యాజమాన్యం ఆధ్వర్యంలో, అల్యూమినా కర్మాగారమునకు బదులు MSME పార్కు నిర్మాణమునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణముగా MSME పార్కు నిర్మాణం చేపట్టే ముందు అందులో ఏర్పాటు చేయబోయే కంపెనీల వివరములు ప్రజలకు తెలియజేస్తూ స్థానికముగా ప్రజాభిప్రాయం సేకరించి, పార్కులో ఏర్పాటు చేయబోయే కంపెనీల విషయమై విధివిధానాలను రైతులకు వివరించే విషయమై 45 రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేయాలని జిందాల్ సి.ఇ.ఓ కనకారావు కోరుతూ, పత్రికాముఖముగా ప్రభుత్వ యంత్రాంగమును కూడా కోరడమైనది.
కానీ నేటివరకు ఎటువంటి చర్యలు చేపట్టనందుకు గాను, నిరసనగా రేపటినుండి జిందాల్ నిర్వాసితులు అందరూ నిరాహార దీక్షలు చేపడుతున్నామని తెలియజేసారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. ఒకప్పుడు టీడీపీ హయాంలో అభివృద్ధి కోటగా ఉన్న శృంగవరపుకోటను ఇవాళ అవినీతి కోటగా మార్చేశారని విమర్శించారు. విశాఖలో జగన్ రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటుంటే, ఇక్కడి ఎమ్మెల్యే రూ.50 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నాడని అన్నారు. మన డబ్బులు దోచేసి ఇళ్లు కట్టుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలో పోటీ పడుతున్నారని లోకేష్ విమర్శించారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్by CVR NEWSఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.by CVR NEWSకలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.by CVR NEWSవిశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
విజయవాడలో మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన కామెంట్స్ చేశారు. స్వార్థ రాజకీయాల కోసమే జగన్ మూడు రాజధానులు అన్నారంటూ విమర్శించారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని ఉందన్నారు. ఆయన చెప్పినవన్నీ జరిగాయని.. ఇది కూడా జరగాలన్నారు. రాయసీమ బాగుపడాలంటే తిరుపతిని రాజధానిగా చేయాలన్నారు. తిరుపతిని రాజధాని చేయడానికి అందరు ఆమోదం తెలుపుతారన్నారు. లక్ష ఎకరాల దాకా ప్రభుత్వ భూమి.. విమానాశ్రయం, 7జాతీయ రహదారులు ఉన్నందున చక్కటి వాతావరణం ఉంటుందన్నారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్by CVR NEWSఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.by CVR NEWSకలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.by CVR NEWSవిశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక కటింగ్ మాస్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలన్నీ పనికి మాలిన సలహాలేనని అన్నారు. సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని దుయ్యబట్టారు. సీఎం సలహాదారుడే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని లోకేష్ అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని.. రేపోమాపో విచారణ నివేదిక వస్తుందని… అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. అధికారులు నీతి, నిజాయతీతో పని చేయాలని చెప్పారు. తన రెడ్ బుక్ లో ఎక్కాలని అధికారులు ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు.
విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో రానున్న ఎన్నికల దృశ్య మెంటాడ గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే ముందుగా సంత తోట నుండి పార్టీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా వెళ్లి గజపతినగరం జనసేన నాయకురాలు పడాల అరుణ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వినీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పడాల అరుణ మాట్లాడుతూ ఈ జగన్ అరాచకపాలనకు చరణగీతం పాడవలసిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి జనసేన పోత్తులలో భాగంగా జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. అనంతరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టిడిపి జనసేన పొత్తుల్లో భాగంగా ఉమ్మడి కార్యకర్తలు సఖ్యతతో పనిచేసి ఇరు పార్టీలలో ఎవరికి టికెట్ వచ్చినా విభేదాలు లేకుండా పనిచేయాలని కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరువాడ కొత్తవలస గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న భూమి మొత్తాన్ని తప్పుడు సర్వేలు చేసి రైతులను సంబంధిత అధికారులు నాన ఇబ్బంది పెడుతున్నారు. భూ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి సుమారు 9 నెలలు అయినా అప్పటి నుంచి అధికారుల వద్దకు రైతులు వెళ్లి తమ భూములకు సంబంధించిన పత్రాలు తప్పుడు సర్వేలతో ఉన్నాయని రైతులు ఎంత వాపోతున్నా సచివాలయ మరియు భూ సర్వే అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామానికి చెందిన సర్పంచ్ కోరాడ శ్రీనివాస్ కి మూడు ఎకరాలు సాగుభూమి ఉండగా అదే సర్వేతో పక్క గ్రామం అయినా ఎడ్లపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి తమ భూమి ఆన్లైన్ చేశారని సర్పంచ్ అవేదన చెందారు. అధికారుల చుట్టూ గత ఎనిమిది నెలల నుంచి తిరుగుతూ ఉన్న కనీసం భూ సర్వేలో ఇటువంటి అవకతవకలు జరిగాయి అని రైతుల వద్ద కనీసం వివరాలు కూడా సిబ్బంది తీసుకోవటం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ఎంతో మేలు జరుగుతుంది అనుకున్నామని…
కానీ ఈ సర్వే మూలంగా తమ భూములను కోల్పోయామని రైతులు వాపోయారు. మండల స్థాయి మరియు జిల్లాలో గ్రీవెన్స్ కు వినతిపత్రాలు ఇచ్చిన
ఎటువంటి ఉపయోగం లేదని తమ భూములు మళ్ళీ తమ పేరుపై ఆన్లైన్లో లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ రైతులు వేడుకుంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. కొంగర మల్లయ్య గట్టు మీద అనుమానస్పద స్థితిలో మహిళ హత్యకు గురైనంది. ఈ నెల 4వ తేదీ పెనుగంచిప్రోలు పియస్ లో భర్త పద్మాల సురేష్, భార్య త్రివేణి కనిపించడం లేదని త్రివేణి తండ్రి ఫిర్యదు చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ సుతారి మేస్త్రి పని చేస్తుంటాడని, మృతురాలు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నట్లు సమాచారం అందిదని పోలీసులు తెలిపారు. విజయవాడ హైదరాబాద్ హైవే పక్కన టోల్ ప్లాజా వద్ద కొంగర మల్లయ్య గట్టు పై మృతదేహం లభ్యమైందని తెలిపారు. భర్తే హత్య చేసి ఉంటడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. Read Also..
విజయనగరం జిల్లా, ఎస్.కోట లో వైసీపీలో ముసలం.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు..అంటూ అసమ్మతి నేతల నిరసన.. శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్.కోట మండలంలో శ్రావణి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం సమావేశం. శృంగవరపుకోట నియోజకవర్గం లో ఐదు మండలాల లో ఉన్న ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,సర్పంచ్ లు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును మార్చాలని స్థానిక నాయకులకు టిక్కెటు కేటాయించాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో స్థానికులకు టికెట్ కేటాయించకుండా మళ్ళీ కడుబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అందుకని స్థానికులకి అవకాశం ఇవ్వాలని అందరూ నాయకులు ముక్తకంఠంతో కోరారు. మా మాట వినకుండా టికెట్ ఇస్తే ముకుమ్ముడు అందరం పార్టీకి రాజీనామాలకు సిద్ధమని తెలిపారు. ఎల్ కోట సీనియర్ నాయకులు సూర్యారావు మాట్లాడుతూ.. మాకు స్థానికుడు తప్ప ఈ ఎన్.ఆర్.ఐ లు మనకి వద్దు కచ్చితంగా అభ్యర్థిని మార్చకపోతే అందరం ముకుమ్ముడి రాజీనామాకైనా సిద్ధం అని ముఖ్తకంఠంతో తెలిపారు.
విజయనగరం జిల్లా, కొత్తవలసలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి. కొత్తవలస మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు & టీడీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారు మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, అందుకు వారందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. బీసీలకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఉంటారని, వారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఆదరణ పథకాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు, సబ్ ప్లాన్ నిధులు, బీసీ భవనాలు, విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బీసీ కులగణన, నామినేటెడ్ పదవులు వంటి అన్ని అవకాశాలు దక్కుతాయని అన్నారు. అంతేకాకుండా విద్యార్థి, విద్యార్థులకు విద్యారంగంలోనూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సామాజిక ఎదుగుదల, బలహీన బడుగు వర్గాలన్నీటికి రాజకీయ పురోభివృద్ధి, ఆర్థిక ఎదుగుదల వంటివి కూడా ఉంటుందని తెలిపారు.