Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh అమరావతి అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు..

అమరావతి అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు..

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తున్న ‘అన్న క్యాంటీన్ల’ నిర్వహణ కోసం ఆమె ఏకంగా 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం ద్వారా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. కేవలం రూ.5 లకే అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో పేదలకు గౌరవప్రదంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లు లక్షలాది మంది కడుపు నింపుతున్నాయని భువనేశ్వరి ఈ సందర్భంగా ప్రశంసించారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళంగా అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారికి ఇంతకన్నా మంచి బహుమానం ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి విరాళం చెక్కును అందజేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014988
Total views : 81433

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.