Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home International మరో బాంబు పేల్చిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ

మరో బాంబు పేల్చిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ

by Rama
మరో బాంబు పేల్చిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ

అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ అనుకున్నట్లే బాంబు పేల్చింది. భారత్‌కు సంబంధించి మరో సంచలన విషయాన్ని బయటపెట్టనున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. ఈ సారి సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు విజిల్‌ బ్లోయర్‌ నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొంది.
గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లలో మాధవి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. గతేడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువరించింది. ఇప్పుడు అదే సంస్థ సెబీని టార్గెట్‌ చేయడం గమనార్హం. దీనిపై సెబీ స్పందించలేదు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

006952
Total views : 46176

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.