అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్.. ఎదురయ్యింది. ఈ కేసు కంటే ముందే తాను నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ కు ఎంపికయ్యారు. ఈ అవార్డును రద్దు చేస్తూ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీ ప్రకటనను విడుదల చేసింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదు అవ్వడంతో జానీ మాస్టర్ కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. 2022ఏడాదికి గాను తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు సినిమాకు బెస్ట్ కొరియో గ్రాఫర్ గా జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వరించింది. అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ ఉంది. అయితే రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరారు. రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేస్తూతీర్పును ఇచ్చింది. దీంతో అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యేందుకు జానీ మాస్టర్ రెడీ అవుతున్నతరుణంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని.. CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు. మేయర్‌గా ఎన్నికైన గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్ పీఠంలో ఉండామని వెల్లడించారు. పేదల…
- శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలుశ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థానం…
- పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గంపెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. రామగుండం మేయర్, పెద్దపల్లి , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను…
- మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలుమున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి…
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి