సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం . ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. అలాగే రాష్ట్రంలోని దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5 లక్షల కంటే అధికంగా ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో 17 మంది సభ్యులతో కూడిన పాలకమండలిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తిరుమలలో లడ్డూ కల్తీ ఘటన తర్వాత.. పాలకమండలిలో బ్రాహ్మణులుండాలన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. ఈ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇక అసెంబ్లీ నిర్వహణ, ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన 6నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్ చర్చించనున్నారు. సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై మంత్రివర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పాలసీలపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించారు. మొత్తం 10 శాఖల్లో నూతన పాలసీలను సిద్ధం చేశారు. వాటిపైనా ఈ కేబినెట్ మీటింగ్‌తో ఓ క్లారిటీకి రానున్నారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన ఆరు పాలసీలపైనా మంత్రివర్గం చర్చించనుంది. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం…
- ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.అమెరికా ఎగువ సభ అయిన యుఎస్ సెనెట్ 2026 ఆగస్టు 7న అత్యంత కీలకమైన “లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026” బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. అమెరికా రాజకీయాల్లో తీవ్ర విభేదాలున్నప్పటికీ, ఈ…
- తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. చంద్రగిరి మండలం కొంగరివారిపల్లె సమీపంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో కలకలం సృష్టించాడు. చిత్తూరు వైపు నుంచి కట్టెల లోడ్‌తో అతివేగంగా తిరుపతి…
- తెలంగాణలో మద్యం ధరల పెంచే యోచనలో ప్రభుత్వం.మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్‌పీ ధరలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను…
- మూసీ సుందరీకరణకు తొలి అడుగు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఆగస్టు 5న ముందస్తు పర్యావరణ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి