Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Andhra Pradesh చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం

చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం

by Satya
చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం

తెలుగుదేశం ఆధ్వర్యంలోచంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. తాజాగా, ఇప్పుడు మళ్లీ వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌరసరఫరాలశాఖ కసరత్తు ప్రారంభించింది.
సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి 538 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ. 2,690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద అరకేజీ కందిపప్పు, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అర లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, 100 గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను రేషన్ కార్డుదారులకు అందిస్తారు.అయితే, రంజాన్ తోఫాలో 2 కేజీల పంచదార, 5 కేజీల గోధుమపిండి, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. అలాగే, రెగ్యులర్ కోటా కింద రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
    తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం…
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
    ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
  • అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
    కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
  • నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
    నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
  • పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
    పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.