Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

by CVR NEWS
ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని బాలికల ఉన్నత పాఠశాలలో కొలుసు పెద్దరెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి సత్కరించారు. నూజివీడు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మండల స్థాయిలో తొలి ఐదు స్థానాలు సాధించిన 25 మంది విద్యార్థులకు 3 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేశారు.ప్రపంచంలో విద్యకు మించిన ఆస్తి లేదని, పేదల భవిష్యత్తును మార్చేది విద్యేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు మంత్రి పార్థసారధి.

Advertisements

You may also like

Our Visitor

023961
Total views : 143633

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.