365
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు యూరియా ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ విధానం ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతోందన్నారు. ఏపీ ఐఎంఎస్ యాప్, ఓటీపీ ఆధారిత వ్యవస్థతో అక్రమాలకు తావులేకుండా రైతులకు ఎరువులు అందజేస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రభుత్వ యాప్ వినియోగంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.