Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ వద్ద ప్రమాదకరంగా వంతెన.

పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ వద్ద ప్రమాదకరంగా వంతెన.

by CVR NEWS
పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ వద్ద ప్రమాదకరంగా వంతెన

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద వంతెన విరిగి ప్రమాదకరంగా మారింది. బ్రిటిష్ కాలంలో ఈ వంతెన నిర్మించారు. సుమారు వంద సంవత్సరాలు కావస్తున్నా కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ బ్రిడ్జి కింద 300 ఎకరాల ఆయకట్టుకు వెళ్లే రైతులకు ఇదే మార్గం, కోలాలపల్లి గ్రామానికి వెళ్లాలన్నా అప్రోచ్ మార్గం ఇదే. ఏ క్షణాన్నైనా వంతెన కూలిపోయే ప్రమాదం ఉన్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ వంతెన పై నుంచి అధికలోడుతో మట్టిటిప్పర్లు, లారీలు యథేచ్ఛగా వెళుతున్నాయి.. వంతెన పొడవునా గ్రిల్ లేకపోవడంతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయనీ.. అధికారులు కనీస మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన కూలిపోతే ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వంతెన పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: