Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh నరసాపురంలో ఆవుల అక్రమ రవాణా అనుమానం.

నరసాపురంలో ఆవుల అక్రమ రవాణా అనుమానం.

by CVR NEWS

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆవుల అక్రమ రవాణా అనుమానంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని చిన్న మామిడిపల్లి బ్రిడ్జి సమీపంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో టాటా ఏస్ వాహనంలో ఐదు ఆవులను తరలిస్తుండగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు అడ్డుకున్నారు. గోవులను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ వాహనాన్ని నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించేలా చర్యలు చేపట్టాలని, అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ నాయకులు డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురానున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: