పార్లమెంట్ సమావేశాల వేళ దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ అభివృద్ధి, ప్రజా సమస్యలు, కేంద్ర-రాష్ట్రాల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో హాజరై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంట్ సమావేశాల బిజీ షెడ్యూల్ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ప్రజాప్రతినిధులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంపై భూపతిరాజు శ్రీనివాస వర్మను పలువురు నేతలు అభినందించారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసం ఇలాంటి సమన్వయ సమావేశాలు తరచూ నిర్వహించాలని నేతలు ఆకాంక్షించారు.
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ నేతల ఆత్మీయ సమ్మేళనం.
220
previous post