జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ‘నేతన్న సేవలో’ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి, చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు స్వంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. చేనేత రంగంలో మహిళల పాత్ర విశేషమని, 70 శాతం కార్మికులు మహిళలేనని చెప్పారు. 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మంచి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.
237
previous post