5.4K
విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 28 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 30న సత్తెమ్మతల్లి ప్రధాన పండుగ నిర్వహించనున్నారు. పంచామృతాలు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి భక్తజన మంగళస్నానం నిర్వహించనున్నారు. మూడు రోజులూ ఆలయం నుంచి ఘటాల ఊరేగింపు కొనసాగనుంది. 28న కలశ ప్రతిష్ఠాపనతో పాటు మహిళల సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తారు. 29న పాలాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం చేపట్టనున్నారు. 30న ప్రధాన పండుగ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ తెలిపింది. సెప్టెంబర్ 27న నెల పండుగను కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించింది.