Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Andhra Pradesh రైతులకు భారీగా ఆర్థిక సాయం.కేబినెట్‌ కీలక నిర్ణయాలు.

రైతులకు భారీగా ఆర్థిక సాయం.కేబినెట్‌ కీలక నిర్ణయాలు.

by CVR NEWS

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేలా తోతాపురి మామిడికి మద్దతు ధర కోసం రూ.281 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. పొగాకు రైతులకు డీబీటీ ద్వారా రూ.94 కోట్ల సాయం అందించనుంది.అమరావతి అభివృద్ధికి సంబంధించి 6,212.50 ఎకరాల భూసమీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎర్రుపాలెం-నంబూరు మీదుగా కొత్త బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, గ్రిడ్‌ రోడ్ల విస్తరణకు ఇది ఉపయోగపడనుంది. శాఖమూరులో రూ.759.79 కోట్లతో ‘అమరావతి సంగమం’ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

మరోవైపు ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో వర్షపాతం మైనస్‌ 52 శాతంగా ఉన్న నేపథ్యంలో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కరువు నివారణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టే అంశంపైనా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని, కోర్టు పరిధిలో ఉన్న 23 మున్సిపాలిటీలతో పాటు మొత్తం 100 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 78 వరద పునరుద్ధరణ పనులకు రూ.6.25 కోట్లకుపైగా కేటాయింపులకు ఆమోదం తెలిపింది. వెలిగొండ టన్నెల్‌-2 వద్ద టీబీఎం తొలగింపు పనులకు రూ.11.63 కోట్లు మంజూరు చేయనుంది. నిత్యావసర ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మంత్రులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని చంద్రబాబు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నేడు లేఖ రాయనున్నట్లు ప్రకటించారు. ప్రతినెలా క్షేత్రస్థాయి పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో 76 శాతం, ప్రకాశం జిల్లాలో 70 శాతం లోటు వర్షపాతం ఉందన్నారు. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: