Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Andhra Pradesh స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేష్‌ కీలక ప్రకటన.

స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేష్‌ కీలక ప్రకటన.

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమరావతిలో టీడీపీ మంత్రులతో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అక్టోబర్‌ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముందుగా మున్సిపల్‌ ఎన్నికలు.. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. పెండింగ్‌ కేసులను పరిష్కరించి అన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికలు వాయిదా వేయాలంటూ వైసీపీ కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టిస్తోందని లోకేష్‌ ఆరోపించారు. ఎన్నికలు వాయిదా పడితే కేంద్ర ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. చట్టపరమైన సమస్యలను అధిగమించి ఎన్నికలను సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్‌ నుంచి అర్హులైన వారికి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: