విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, రోగులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రభుత్వ సలహాదారు షరీఫ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా డెంటల్ చైర్స్, 24 బెడ్లు, సీసీ రోడ్లు, పార్కింగ్ షెడ్, కాంపౌండ్ వాల్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. రోజుకు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్న నేపథ్యంలో.. రోగులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. మెడికల్ యూనివర్సిటీలో రోగులు, సహాయకుల కోసం ఆర్‌ఓ ప్లాంట్, షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. డెంటల్ విద్యార్థుల కోసం అధునాతన హాస్టల్‌ను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కళాశాలను మరింత అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.
విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో అభివృద్ధి పనులు.
1.3K
previous post