పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు విమర్శించడంపై కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే స్థాయి ప్రసాదరాజుది కాదని అన్నారు. ఎమ్మెల్యేలు పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించడం అవమానం కాదని, ప్రజాప్రతినిధుల బాధ్యతను గుర్తు చేయడమేనని పేర్కొన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని కొత్తపల్లి కొనియాడారు. నరసాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, సీఎం పర్యటనను రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. చంద్రబాబు స్థాయి, విజన్, రాజకీయ అనుభవాన్ని అర్థం చేసుకోకుండా ప్రసాదరాజు విమర్శలు చేయడం తగదని స్పష్టం చేశారు.
ప్రసాదరాజుపై కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్.
993
previous post