Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Andhra Pradesh ప్రభుత్వ బడులకు కార్పొరేట్ హంగులు.

ప్రభుత్వ బడులకు కార్పొరేట్ హంగులు.

by CVR NEWS

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నెల్లూరు నగరంలో సీఎస్ఆర్ నిధులతో ఆధునికంగా అభివృద్ధి చేసిన రెండు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. పాఠశాలలను సందర్శించిన ఆయన.. తరగతి గదులు, ప్రయోగశాలలు, డైనింగ్ హాల్‌ను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీసి.. బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్ ఫౌండేషన్ నిధులతో రెండు అంతస్తుల్లో నిర్మించిన పాఠశాలలో 43 తరగతి గదులను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి తరగతి గదిలో ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఆధునిక బెంచీలు ఏర్పాటు చేశారు. కంప్యూటర్, రోబోటిక్స్, ఆస్ట్రో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లతో పాటు ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. క్రీడలకు ప్రాధాన్యమిస్తూ ఎకరం విస్తీర్ణంలో ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులతో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు.

అనంతరం మూలపేట 39వ డివిజన్‌లో రూ.13.4 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించిన డీఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాలను కూడా లోకేశ్ ప్రారంభించారు. ఆర్‌ఎస్‌ఆర్ పాఠశాల పనితీరుపై ప్రధానోపాధ్యాయుడు, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. కేవలం భవనాలు నిర్మిస్తే సరిపోదని, విద్యా ప్రమాణాలు, ఫలితాలు కూడా మెరుగుపడాలని స్పష్టం చేశారు. గతేడాది పదో తరగతిలో 60.19 శాతం ఉత్తీర్ణత నమోదవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి.. హాజరు, ఎన్‌రోల్‌మెంట్ తగ్గడానికి కారణాలను తెలుసుకుని, ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడేలా ఫలితాలు పెంచాలని అధికారులను ఆదేశించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: