Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Andhra Pradesh పుంగనూరులో భారీ వర్షాలకు పెను ప్రమాదం.

పుంగనూరులో భారీ వర్షాలకు పెను ప్రమాదం.

by CVR NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరులో భారీ వర్షానికి పెను ప్రమాదం తప్పింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మదనపల్లి రోడ్డులోని ఓ చికెన్ షాప్ పిట్టగోడ, మోల్డింగ్ ప్లేట్ ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా.. సమీపంలోని దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి.

వర్షం కురుస్తున్న సమయంలో షాప్ యజమాని దుకాణంలోనే ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పిట్టగోడ కూలడంతో జహీర్ చికెన్ షాప్‌తో పాటు పక్కనే ఉన్న స్కూటర్ మెకానిక్ షాప్‌కు నష్టం వాటిల్లింది. రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కావడంతో దుకాణదారులు తీవ్రంగా నష్టపోయారు.

భారీ వర్షాల కారణంగానే పిట్టగోడ కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. దుకాణాలు, ద్విచక్ర వాహనాలకు జరిగిన నష్టంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు దాదాపీర్, భావాజాన్ తెలిపారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: