Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home Andhra PradeshKrishana విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్..

విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్..

by Rama
Sujana Chowdary

విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సుజనా చౌదరికి మద్దతుగా వైసీపీ 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ కుమార్ బీజేపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత అయిన బుల్లా విజయ్ కుమార్ వందలాది మంది అనుచరులతో బీజేపీలో చేరారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని, ఆ స్థాయి గల నాయకుడు విజయ్ కుమార్ అని సుజనా చౌదరి అన్నారు దళిత వర్గానికి చెందిన విజయ్ కుమార్ వంటి నాయకులు బీజేపీలో చేరడం మరింత బలం చేకూరుస్తుందనే నమ్మకం తమకుందని అన్నారు. ఓటర్లు 13వ తేదీ ఉదయం ఆరు గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, 75శాతానికిపైగా పోలింగ్ జరిగేలా ఓట్లేయాలని ప్రజలను సుజనా కోరారు..

Follow us on : FacebookInstagramYouTube & Google News

చవాకులు పేలితే వైసీపీ నేతల తాట తీస్తా-విజయ్ కుమార్

సీనియర్లకు వైసీపీలో గుర్తింపు లేదని విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న తాను ఎన్నో అవమానాలను భరించానని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసిన తనపై ఎవరైనా తనపై అవాకులు చవాకులు పేలితే తాట తీస్తానని విజయ్ కుమార్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ చేరిక నియోజక వర్గానికి నూతన అధ్యాయాన్ని సృష్టి స్తుందనే నమ్మకం తమకు ఉందని టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు. బొమ్మసాని సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, యేదుపాటి రామయ్య, రజనీ, మోబిన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..
    ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‍తో సౌత్‌ స్టేట్స్‌తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
  • భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
Advertisements

You may also like

Our Visitor

005714
Total views : 38498

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.