Wednesday, March 11, 2026
News Navigation
Home Political జార్ఖండ్ లో బీజేపీ VS కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్

జార్ఖండ్ లో బీజేపీ VS కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్

by Rama
జార్ఖండ్ లో బీజేపీ VS కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాడివేడి సోషల్ మీడియా వార్ నడుస్తోంది. జార్ఖండ్ బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి రెండో ఫిర్యాదు చేసింది. జార్ఖండ్ బీజేపీ పోస్ట్ చేసిన వీడియోలో కాంగ్రెస్ మిత్రపక్షం జార్ఖండ్ ముక్తి మోర్చాను తప్పుగా చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం హేమంత్ సోరెన్ పాత్రలో ఒక నటుడిని చూపించారు. మైనారిటీలకు మాత్రమే జేఎంఎం మేలు చేస్తోందనేలా ఆ వీడియోలో సందేశం ఉంది. ప్రజలను విభజించేలా బీజేపీ ప్రచారం ఉందని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రస్తావించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.