Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home International UNSC : గాజాలో కాల్పుల విరమణ..!

UNSC : గాజాలో కాల్పుల విరమణ..!

by Satya
Cease fire in Gaza


ఐరాస భద్రతా మండలి(UN Security Council) లో తొలిసారిగా తీర్మానం..

ఉగ్రవాద సంస్థ హమాస్ ను అంతమొందించేందుకు గాజా(Gaza)లో దాదాపు 5 నెలలుగా ఇజ్రాయెల్(Israel) కొనసాగిస్తున్న యుద్ధకాండను తక్షణమే ఆపివేయాలని ఐక్యరాజ్యసమితి(United Nations) కోరింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతా మండలితొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను వ్యతిరేకించిన అమెరికా తాజా తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉంది. రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పులను విరమించుకోవాలని కోరిన ఈ తీర్మానంపై ఓటింగ్ జరగగా.. భద్రతా మండలిలో అమెరికా(America) మినహా మిగతా 14 సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.

నాటి నుంచి హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..

స్లోవేనియా(Slovenia), స్విట్జర్లాండ్‌(Switzerland)తో పాటు భద్రతా మండలిలోని అరబ్ దేశాల కూటమి అల్జీరియా ద్వారా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. శాశ్వత కాల్పుల విరమణకు మార్గం చూపడంతో పాటు అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన అమాయక బంధీలను కూడా వదిలిపెట్టాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. కాల్పుల విరమణలో శాశ్వత అనే పదాన్ని తొలగించడంపై రష్యా చివరి నిమిషంలో అభ్యంతరం తెలిపింది. వీటో కోరినప్పటికీ ఆమోదం పొందడంలో విఫలమైంది. గతంలో తీర్మానాల ద్వారా హమాస్‌ను ఏమాత్రం ఖండించకుండా తాజాగా భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదింపజేయడాన్ని ఇజ్రాయెల్ విమర్శించింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏకంగా వెయ్యికి పైగా చనిపోయారు. 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా కూడా మార్చుకున్నారు. నాటి నుంచి హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది.

Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక …
ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న నౌకపై దాడి.
హార్ముజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న మరో నౌకపై దాడి చోటు …
ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు.
అమెరికా, ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. పరస్పరం దాడులు ప్రతిదాడులకు దిగుతున్నారు. తాజాగా హర్మూజ్‌ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023042
Total views : 140778

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.