Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Latest News ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ఇంధన లభ్యతపై సమావేశాలు నిర్వహించారు…

ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ఇంధన లభ్యతపై సమావేశాలు నిర్వహించారు…

by CVR NEWS

పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితుల ప్రభావంపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ఇంధన లభ్యతపై సమావేశాలు నిర్వహించారు. దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని..వదంతులు నమ్మవద్దని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. తాజాగా దేశంలో నిత్యావసరాల లభ్యత, వాటి ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. నిత్యావసర ధరల్లో పెద్దగా మార్పులు లేవని బఫర్ స్టాక్స్ తగినంతగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో గోధుమలు, బియ్యం నిల్వలు అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆహార – ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి.శిఖ స్పష్టం చేశారు. బఫర్ స్టాక్ నిబంధనల కంటే మూడు రెట్లు అధికంగా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద గోధుమలు సుమారు 222 లక్ష మెట్రిక్ టన్నులు, బియ్యం: సుమారు 380 లక్ష మెట్రిక్ టన్నులు ఉన్నాయని తెలిపారు. ఈ నిల్వలు ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలను తీర్చడమే కాకుండా, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సరిపోతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.భారతదేశానికి కీలక భాగస్వామ్య దేశాలైన ఇండోనేషియా, మలేషియా, రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా బ్రెజిల్ నుండి దిగుమతులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని శిఖ తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

004899
Total views : 33617

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.