చంద్రబాబు(Chandrababu) ఉమ్మడి మేనిఫెస్టో(Manifesto) విడుదల చేశారని నారా లోకేశ్(Nara Lokesh) వెల్లడించారు. అందులో బాబు సూపర్-6 పేరిట హామీలు ఇచ్చామని తెలిపారు. అందులో మొదటి హామీ ప్రకారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నిరుద్యోగ యువతీయువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని లోకేశ్(Lokesh) ప్రకటించారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తామని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మెగా డీఎస్సీ పైనే తమ ప్రభుత్వ తొలి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు. ప్యూన్ నుంచి కానిస్టేబుల్, గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల వరకు సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదని, గూగుల్ ను శోధించాల్సిన అవసరం లేదని, సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
- అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
- సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…
- అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.