173
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులకు కలుస్తున్నారు. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. వానాకాలం యాసంగి పంటకు సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని కేంద్రమంత్రిని కోరారు. 2025-26 సీజన్ కు గాను యాసంగి పంట 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని కేంద్రమంత్రికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ధాన్యం సేకరణ, కేంద్ర ప్రభుత్వం వాటా సంబంధిత అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. కేంద్ర పౌరసరఫరాల శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.





Total views : 81457