Saturday, May 9, 2026
News Navigation
Saturday, May 9, 2026
News Navigation

Breaking

Saturday, May 9, 2026
Home Telangana కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

by Rama
కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

బీఆర్ఎస్ నేతల ఫామ్‌ హౌస్‌ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ముఖ్యమంత్రి రేవంత్‌‎రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికేనని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని సీఎం రేవంత్‌‎రెడ్డి స్పష్టం చేశారు.తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌‎రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అలాంటివారి భరతం పడుతుందని హెచ్చరించారు. హైడ్రా అనగానే కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ బయటకు వచ్చారని.. పేదలు ఎవరైనా ఫామ్‌‎హౌస్‌లు కట్టుకోగలరా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో కేసీఆర్‌ కుటుంబానికి ఏమైనా పోలిక ఉందా? అని నిలదీశారు. ప్రధాన మంత్రి పదవినే త్యాగం చేసిన చరిత్ర సోనియా గాంధీది అని సీఎం రేవంత్‌‎రెడ్డి చెప్పారు.

కేసీఆర్‌ కుటుంబానిది దోపిడీ చరిత్ర అని ఆరోపించారు. ఆక్రమణదారులే హైడ్రాను చూసి భయపడుతున్నారని సీఎం రేవంత్‌‎రెడ్డి అన్నారు. మూసీ మురికిలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బుల్డోజర్లను కూడా సిద్ధం చేశా.. ఎవరు అడ్డం వస్తారో రావాలని హెచ్చరించారు. వాళ్ల ఫామ్‌ హౌస్‌లపైకి బుల్డోజర్లు వస్తాయనే భయంతో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌‎రెడ్డి మండిపడ్డారు. తన ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజులను హరీశ్‌రావు మర్చిపోయారా అని ప్రశ్నించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?
    ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
  • హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..
    స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
  • ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..
    ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
  • విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..
    పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్‌ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
  • యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..
    యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

010941
Total views : 70915

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.