Wednesday, March 11, 2026
News Navigation
Home Telangana లోకల్ టికెట్లకు కాంగ్రెస్‌లో కాంపిటీషన్

లోకల్ టికెట్లకు కాంగ్రెస్‌లో కాంపిటీషన్

by Rama
లోకల్ టికెట్లకు కాంగ్రెస్‌లో కాంపిటీషన్

తెలంగాణ లో ఎన్నికలకు ఇప్పటి నుంచే లోకల్ టికెట్లకు కాంగ్రెస్‌లో కాంపిటీషన్ నెలకొన్నది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లకు పుల్ పోటీ ఉన్నది. తమకే టికెట్ ఇవ్వాలని పలువురు ఆశావహులు మంత్రుల చూట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు తమకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన లోక్ సభలోనూ తన ఓటింగ్ శాతం పెంచుకొని సత్తా చాటింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎన్నికల కసరత్తును మొదలు పెట్టింది. మెజార్టీ స్థానాలు తమవేనంటూ మంత్రులు ప్రచారం చేయడంతో, లోకల్ కేడర్ లో టికెట్ల ఆశలు రెట్టింపయ్యాయి. టికెట్ వస్తే కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల మంత్రులతోపాటు కొందరు సీఎంతో సన్నిహితంగా ఉండే నేతలనూ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.