Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు

నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు

by Satya
TDP and YCP

పల్నాడు జిల్లా (Palnadu) నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు జరిగాయి. రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నారు వైసీపీ, టీడీపీ ఎంపీ అభ్యర్థులు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించనుంది టీడీపీ అధిష్టానం. ఇప్పటికే నారా చంద్రబాబుతో రెండుసార్లు భేటీ అయ్యారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. టీడీపీ పార్టీలోకి చేరకముందే డాక్టర్లు, వ్యాపారస్తులు, న్యాయవాదులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు ఎంపీ లావు. అయితే నెల్లూరువాసులు నరసరావుపేటలో పోటీ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ అందరిలోనూ ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరుకి చెందిన.. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయనున్నారు. నరసరావుపేటలో భారీ ఎత్తున అనిల్ కుమార్ యాదవ్ కు ఆహ్వాన సభ నిర్వహించారు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్చార్జిలు. గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీలుగా గెలుపొందారు. వైసీపీ ఎంపీగా గెలిచిన లావు కృష్ణదేవరాలకి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంచి పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గెలిచారు. 2024 ఎన్నికలకు టీడీపీ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం
    జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్‌నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…
  • సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..
    తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
  • ‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌…
    ఆనందో బ్ర‌హ్మ‌, సేవ్ ది టైగ‌ర్స్ వంటి ఎంట‌ర్‌టైన‌ర్స్ సృష్టిక‌ర్త మ‌హి వి.రాఘ‌వ్ నుంచి రాబోతున్న మ‌రో స‌రికొత్త కామెడీ హార‌ర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్ష‌కుల‌ను…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

006949
Total views : 46159

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.