Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Telangana చివరి దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వే

చివరి దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వే

by Rama
చివరి దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సర్వే డేటా ఎంట్రీ లో నాణ్యత చాలా ముఖ్యమైందని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తాయి కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమ బద్ధకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాలని తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.