Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News ఎల్బీనగర్‌ పీఎస్ పరిధిలో హృదయవిదారక ఘటన.

ఎల్బీనగర్‌ పీఎస్ పరిధిలో హృదయవిదారక ఘటన.

by CVR NEWS

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బీదర్ జిల్లాకు చెందిన రాజేశ్వరి… తన తొమ్మిది నెలల కుమార్తె అనురాధను బైరామల్‌గూడ చెరువులో ముంచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఘటన సమయంలో రాజేశ్వరి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు… ఘటనకు దారితీసిన పరిస్థితులు, హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: