131
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గుండెపోటుగా నమ్మించిన ఓ వివాహిత మరణం.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్యగా తేలింది. సోర్లిగాం గ్రామంలో జరిగిన దుంపల హరిణి అనే వివాహిత మృతి వెనుక ఉన్న అసలు నిజాన్ని టెక్కలి పోలీసులు ఛేదించారు. కన్నతల్లి, తాత, భర్త కలిసి.. ముందస్తు వ్యూహంతో ఇనుప రాడ్డుతో కొట్టి హరిణిని కిరాతకంగా అంతమొందించినట్లు డీఎస్పీ లక్ష్మణరావు ప్రెస్ మీట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. అంతేకాదు, ఎవరికీ అనుమానం రాకుండా గుండెపోటుగా నమ్మించి, గుట్టుచప్పుడు కాకుండా దహనసంస్కరణలు కూడా కానిచ్చేశారు. కట్టుకున్నవాడు, కన్నవాళ్లే కాలయముళ్లుగా మారిన ఈ షాకింగ్ మర్డర్ ఇప్పుడు చూద్దాం



Total views : 203019