Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Devotional తిరుమలలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు.

తిరుమలలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు.

by CVR NEWS

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒక కోటి 11 లక్షల 96 వేల 170 లడ్డూలు, మే నెలలో 1 కోటి 21 లక్షల 35 వేల 528 లడ్డూలు, జూన్ నెలలో 1 కోటి 26 లక్షల 81 వేల 805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. కాగా, 2024 జూన్ నెలలో 1కోటి 02 లక్షల 64 వేల 364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1 కోటి 19 లక్షల 21 వేల 353 లడ్డూలు విక్రయాలు జరగగా, 2026 జూన్ నెలలో 1 కోటి 26 లక్షల 81 వేల 805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్‌తో పోలిస్తే 7 లక్షల 59 వేల 452 లడ్డూలు అధికంగా విక్రయమవ్వడంతో 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024తో పోలిస్తే 24 లక్షల 17 వేల 441 లడ్డూలు అధికంగా విక్రయమవ్వగా 23.55 శాతం వృద్ధి నమోదైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీలో టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040023
Total views : 203001

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: