Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Devotional శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

by CVR NEWS

శబరిమల యాత్రలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గురుస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల సమస్యలపై విజయవాడలో గురుస్వాముల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. శబరిమలకు వెళ్లే భక్తుల్లో సుమారు 70 శాతం మంది స్థానికేతరులేనని గురుస్వాములు తెలిపారు. భక్తుల నుంచి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ కనీస వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మకరజ్యోతి సమయంలో ఏపీ, తెలంగాణ భక్తులు రోడ్లపైనే పడుకునే పరిస్థితి ఉందని తెలిపారు. నీలక్కల్, పంబ, సన్నిధానం వద్ద మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

తెలుగు భక్తుల కోసం ప్రత్యేక సమాచార కేంద్రాలు, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడంతో పాటు తెలుగులో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని గురుస్వాములు కోరారు. కేరళ దేవస్థానం బోర్డులో తెలుగువారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. భక్తుల సమస్యలపై కేరళ ప్రభుత్వంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడాలని భాను ప్రకాశ్ రెడ్డి కోరారు. తాగునీరు, బాత్‌రూమ్‌లు, వసతి సమస్యలను పరిష్కరించాలని, అన్నప్రసాదం అందించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. కేరళ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: