Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Devotional స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

by CVR NEWS

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో.. దర్శన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వామివారిని దర్శించుకోగా.. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఎంపీకి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. మరోవైపు దేవస్థానం ఈఓ పెంచల కిషోర్ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.100 దర్శన క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం నిత్య అన్నదాన భవనాన్ని సందర్శించిన ఈఓ పెంచల కిషోర్.. భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. భోజనం నాణ్యత, రుచిపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: