Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Andhra Pradesh విశాఖలో విజృంభిస్తున్న డయేరియా

విశాఖలో విజృంభిస్తున్న డయేరియా

by Rama
విశాఖ లో విజృంభిస్తున్న డయేరియా

విశాఖ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. గత ఐదు రోజుల్లో 40 మంది వరకు డయేరియా బారినపడ్డారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. డయేరియాతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంచినీటిని సరఫరా చేసే పైప్ లైన్ లో మురుగునీరు కలుస్తుండడం వల్లే డయేరియా ప్రబలినట్లు సమాచారం. డయేరియా ప్రబలిన ప్రాంతంలో అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.