Wednesday, March 11, 2026
News Navigation
Home International కోర్టులో 1,460 కోట్ల బాండ్‌ సమర్పించిన డొనాల్డ్‌ ట్రంప్‌

కోర్టులో 1,460 కోట్ల బాండ్‌ సమర్పించిన డొనాల్డ్‌ ట్రంప్‌

by Satya
Donald Trump

అమెరికా(America) అధికార పీఠాన్ని రెండోసారి దక్కించుకునేందుకు బరిలోకి దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) తాజాగా కోర్టులో 1,460 కోట్ల బాండ్‌ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్‌ డాలర్ల జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకొన్నారు. దీంతో ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉండదు. ట్రంప్‌ తన ఆస్తుల మొత్తాన్ని వాస్తవిక విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇది చదవండి: తైవాన్‌‌లో భారీ భూకంపం..!

కొన్నేళ్ల పాటు ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారన్న అభియోగాలపై కేసు నమోదైంది. ఒకవేళ పైకోర్టులో ట్రంప్‌ దోషిగా తేలితే.. తాజాగా దాఖలు చేసిన 1460 కోట్ల రూపాయల బాండ్ ఆయనకు తిరిగి రాదు. ఒకవేళ నిర్దోషిగా తేలితే ఆయన బాండును తిరిగి ఇచ్చేస్తారు. దీనిపై సెప్టెంబరులో వాదనలు జరగనున్నాయి. తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ట్రంప్‌ తొలి నుంచి వాదిస్తూ వస్తున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


పశ్చిమాసియాలో యుద్ధ భీకర రూపం దాల్చుతోంది.
పశ్చిమాసియాలో యుద్ధ భీకర రూపం దాల్చుతోంది. సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా …
ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం.
పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని తాజాగా ఓ నివేదిక …
శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి..
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు..ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక ఘటన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.