తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7గంటల27 నిమిషాలకు అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. దీని కేంద్రం ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. దీని ప్రభావం మాత్రం 225 కిలోమీటర్ల మేర విస్తరించింది.
హైదరాబాద్ పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలోనూ ప్రకంపనలు కనిపించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్టణం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్…
- అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
- నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు…
- సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…
- అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి