మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈనెల 28 నుంచి వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్(CM Jagan) ఎన్నికల ప్రచారం(Election campaign) భేరి మోగించనున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు. ఈనెల 28న ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈనెల 28వతేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ ఎన్నికల ప్రచారానికి ఒక రోజు ముందు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సింగపూర్‍లో CBN @ 361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ.ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం…
- సింగపూర్‍లో భారత హై కమిషనర్‍తో సీఎం చంద్రబాబు భేటీ.సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ముందుగా అక్కడి భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని..రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్…
- ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడుస్తున్నా, ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 144593