మెదక్ జిల్లా(Medak District)లో అకాల వర్షంతో రైతులు(Farmers) నష్టపోతున్నారు. మరో వైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట కళ్ళముందే వర్షార్పణం కావడంతో కన్నీరు, మున్నీరు అవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట నార్సింగి, నిజాంపేట మండలాల్లో కొన్ని గ్రామాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇది చదవండి: గొలుసు దొంగ ను వెంటాడి పట్టుకున్న స్థానికులు
వర్షానికి ధాన్యం తడవకుండా ఉండడానికి అవసరమైన కవర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని మార్కెట్ కేంద్రంలో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు కోతుల బెడద తీవ్రంగా ఉంది. ధాన్యం కుప్పలపై ఎగబడి కోతులు ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి. ఓవైపు కోతులు, మరోవైపు అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశంతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
- జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…
- కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్తెలంగాణలో వరి ధాన్యం, మొక్క జొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. మొక్కజొన్న…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి




Total views : 74521