Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Film మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం అనౌన్స్‌మెంట్.

మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం అనౌన్స్‌మెంట్.

by CVR NEWS

మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం అనౌన్స్‌మెంట్- ధృవ్ విక్రమ్, కరణ్ అరవింద్ కుమార్, ‘మైత్రీ మూవీ మేకర్స్’ #MythriTamil04 #DV4 పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో వారి నాలుగవ తమిళ చిత్రాన్ని ప్రకటించారు. ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న నాలుగవ చిత్రం కావడం విశేషం. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

చెన్నైలోని MRC నగర్‌ మైత్రీ ఆఫీస్ లో జరిగిన పూజా కార్యక్రమంతో #MythriTamil04 #DV4 ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్ర బృందం, పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యారు.ధృవ్ విక్రమ్, దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్, చిత్ర బృందంతో కలిసి ఈ శుభకార్యంలో పాల్గొన్నారు.

ముహూర్తం షాట్ కు దర్శకుడు కీర్తిశ్వరన్ క్లాప్‌బోర్డ్ కొట్టారు. దర్శకులు అధిక్ రవిచంద్రన్, రవికుమార్, కీర్తిశ్వరన్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశి, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు.

నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం (DV4), ధృవ్ విక్రమ్‌ను పూర్తిగా మాస్-ఓరియెంటెడ్ అవతార్‌లో కనిపించనున్నారు. నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలతో ప్రయోగాలు చేయడానికి పేరుపొందిన ధృవ్ , ఇప్పుడు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ కోసం సిద్ధమయ్యారు.

కరణ్ అరవింద్ కుమార్, సబీతో కలిసి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని వికీ నిర్వహించనుండగా, జయసూర్య ఎడిటర్‌. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా, ప్రొడక్షన్ డిజైనర్ జి.ఎం. శేఖర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: