Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home TelanganaHyderabad గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..

గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..

by Rama
gali anil kumar

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఆశోక్ నగర్ లోని తన కార్యాలయంలో గాలి అనిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేళ్లు కష్టపడ్డానని, కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదన్నారు. స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేశానని, బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు. గత ఐదేళ్లక్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఆనాడు – ఈనాడు నాకు మోసం జరిగిందన్నారు. నేషనల్ పేపర్ లకు యాడ్స్ ఇవ్వడం తో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకులతో పాటు నాకు ED నోటీసులు అందాయన్నారు. ఇంత జరిగిన రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పలకరించలేదని వాపోయారు. తీవ్ర మనస్థాపం చెంది కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తూ ఏఐసీసీ ఇంచార్జీ ఖర్గే కు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని అందజేశారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: