Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Telangana తెలంగాణకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన

తెలంగాణకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన

by Satya
తెలంగాణకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ఈరోజు, రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..
    కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా…
  • నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..
    పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
  • అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..
    వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
  • ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర నియామకం..
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా…
  • ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు
    అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

007259
Total views : 47727

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.