AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి కేంద్ర నిఘా వర్గాలు. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పవన్ కల్యాణ్ తన భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో, పవన్ కల్యాణ్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమిలో కీలక నేతగా ఉండడం, ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి మద్దతుదారు కావడంతో, ఆయనను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా…
- నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
- అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
- ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర నియామకం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా…
- ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలుఅమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 47786