ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్ బృందం టెహ్రాన్ చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బిహార్ గవర్నర్ సయ్యద్ అత్-హస్నైన్‌లు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జై శ్వాల్ వెల్లడించారు. వీరితోపాటు భారత్‌కు చెందిన పలువురు మత పెద్దలతో కూడిన బృందం కూడా ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా టెహ్రాన్‌కు చేరుకుంటున్నారు. ఐదు రోజుల పాటు కొనసాగే ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో లక్షలాది మంది అభిమానులు, విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా ముప్పుపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ స్పందిస్తూ… రానున్న రోజుల్లో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఏమైనా ప్రయత్నాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. మునుపెన్నడూ చూడని విధంగా తమ ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఐఆర్‌జీసీ ఇలా స్పందించింది.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు.
124
previous post