జెన్-జీ.. భారత ఉపఖండంలో ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నంది . బంగ్లాదేశ్, నేపాల్‌లో జెన్-జీ యువత ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలను కూలదోసింది. భారత్‌లో జెన్-జీ నిరసనలు కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీశాయి. ఈ నేపథ్యంలో పాక్ పాలకుల్లో జెన్-జీ భయం పతాకస్థాయికి చేరింది. దేశ జెన్-జీ యువత తిరగడబడితే తట్టుకోలేమని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసీన్ నఖ్వీ తాజాగా హెచ్చరించారు. ఇస్లామాబాద్‌లో ఎకనమిక్ సమ్మిట్-2026 సందర్భంగా నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాక్ పాలన విధానం మౌలిక స్థాయిలో విఫలమైందని మంత్రి నఖ్వీ అన్నారు. పాలకులకు, యువతకు మధ్య అంతరం పెరిగిపోతోందన్నారు. యువతలో అసంతృప్తి, నిస్పృహ పతాకస్థాయికి చేరుకున్నాయని హెచ్చరించారు. ఆర్థిక అస్థిరత, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, విపరీతంగా పెరిగిన నిరుద్యోగిత కారణంగా యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకోవచ్చని హెచ్చరించారు.