Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home International లండన్‌లో కన్నులపండువగా గంగా హారతి.

లండన్‌లో కన్నులపండువగా గంగా హారతి.

by CVR NEWS

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. చిన్మయ మిషన్‌ సేవలు ప్రారంభించి 75ఏళ్లు అయిన సందర్భంగా.. చిన్మయ్‌ మిషన్‌ యూకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గంగా నది ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హారతి తరహాలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్మయ మిషన్‌ యూకే గ్లోబల్‌ హెడ్‌ స్వామి స్వరూపానంద మాట్లాడుతూ.. గంగమ్మ తల్లి స్ఫూర్తి, సంప్రదాయాలు, సంస్కృతి, జ్ఞానం, దైవత్వం గుర్తుచేసుకునేందుకే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రీన్‌విచ్‌లో థేమ్స్‌ నది ఒడ్డున గంగా హారతి కార్యక్రమానికి నాయకత్వం వహించిన ఆయన చిన్మయ మిషన్‌ యూకేలో చేపట్టిన విద్య, గ్రామీణాభివృద్ధి సేవా కార్యక్రమాలను వివరించారు. కాగా ఈ కార్యక్రమం పూర్తిగా థేమ్స్‌ నది ఒడ్డునే నిర్వహించారు. దీపాలను కూడా నదిలోకి జార విడువకుండా ఒడ్డునే ఉంచారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: