Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home International అమెరికా కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.

అమెరికా కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.

by CVR NEWS
అమెరికా కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. H-1B వీసాలపై కీలక తీర్పు వెలువడింది. విదేశీ ఉద్యోగులకు ఇచ్చే కొత్త H-1B వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు కొట్టేసింది. ఇది చట్ట విరుద్ధమైన ఫీజు అంటూ వ్యాఖ్యానించింది. దీనిని US కాంగ్రెస్ కూడా ఆమోదించలేదని, బోస్టన్‌లోని డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఫీజులు సవాలు చేస్తూ 20 మంది అటార్నీ జనరల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోరోకిన్ తాజాగా తీర్పు చెప్పారు. దీంతో ట్రంప్‌కు షాక్‌ తగిలినట్లయింది. ఇక గతంలో ట్రంప్ సర్కార్ ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసాల‌ దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయి. పాత రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సాధారణంగా H-1B ప్రోగ్రాం ప్రతి ఏడాది సుమారు 65 వేల వీసాలను అందిస్తోంది. అదనంగా ఉన్నత విద్యార్హతలు ఉన్నవాళ్లకు మరో 20 వేల వీసాలు లభిస్తున్నాయి. అయితే ఈ వీసాలకు కంపెనీలు చెల్లించే ఫీజు సుమారు 2000 డాలర్ల నుంచి 5వేల డాలర్ల వరకు ఉండేది. కానీ కొత్తగా ప్రతిపాదించిన లక్ష డాలర్ల ఫీజు కంపెనీలకు తీవ్రంగా భారం కానుంది. అయితే ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలో కొంతమంది సమర్థిస్తున్నారు. అమెరికా ఉద్యోగాలను రక్షించడం కోసం ఇలాంటి చర్యలు తప్పవని చెబుతున్నారు. విదేశీ ఉద్యోగులు తక్కువ ఫీజులతో అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని పేర్కొంటున్నారు. కానీ వీటిని కోర్టు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. విదేశీ ఉద్యోగులకు ఇచ్చే కొత్త H-1B వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు కొట్టేసింది.

Advertisements

You may also like

Our Visitor

040023
Total views : 202986

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: