మంగళగిరిలో ఐపీఎల్ లైవ్ అనుభూతిని పంచేందుకు ‘మెగా ఫ్యాన్ పార్క్’ సిద్ధమైందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తెలిపారు. రేపు, ఎల్లుండి జరగబోయే ఉత్కంఠభరిత ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం మంగళగిరి టిడ్కో పార్క్ ప్రాంగణంలో సకల సదుపాయాలు సమకూర్చారు. స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలిగేలా.. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ అద్భుత అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి ఇప్పుడు క్రికెట్ హబ్‌గా మారబోతోందన్నారు. ఇక్కడ ప్రత్యక్ష ప్రసారంతో పాటు.. ఈలలు, కేరింతలు, ఫేస్ పెయింటింగ్స్ మరియు క్రేజీ స్టంట్స్‌తో సందడి నెలకొననుంది. ఐపీఎల్ అధికారిక స్పాన్సర్‌ల ఆధ్వర్యంలో మ్యూజిక్, మర్చండైజ్, ఫుడ్ స్టాల్స్ మరియు పానీయాలు ఏర్పాటు చేస్తుండటంతో వినోదం రెట్టింపు కానుంది. ఈ ఫ్యాన్ పార్క్‌లోకి ప్రవేశం పూర్తిగా ఉచితమని సానా సతీష్ తెలిపారు. దేశవ్యాప్తంగా 50 నగరాల్లో నిర్వహిస్తున్న ఈ ఫ్యాన్ పార్కుల ద్వారా కోటి మందికి పైగా అభిమానులు ఐపీఎల్ ఫీవర్‌ను ఎంజాయ్ చేస్తారని అంచనా. బౌండరీల హోరు, హ్యాట్రిక్‌ల జోరును భారీ తెరలపై వీక్షిస్తూ.. మీ అభిమాన జట్టును ఉత్సాహపరిచేందుకు సిద్ధం కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మంగళగిరిలో మెగా ఫ్యాన్ పార్క్
114
previous post






Total views : 81428